గీతమ్ ఘనంగా 76 వ స్వాతంత్య్ర దినోత్సవం

politics Telangana

మనవార్తలు ,పటాన్ చెరు:

‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ‘ వేడుకలలో భాగంగా , గీతం డీమ్డ్ విశ్వవిద్యాయలం , హెదరాబాద్ ప్రాంగణంలో సోమవారం 76 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు . గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించగా , జాతీయ గీతాలాపనతో పాటు ఎన్సీసీ విద్యార్థులు పరేడ్ను నిర్వహించారు . ఈ సందర్భంగా శాస్త్రీయ , సమకాలీన నృత్య ప్రదర్శనలు , దేశభక్తి గేయాలను విద్యార్థులు ఆలపించారు .

ఈ సందర్భంగా ప్రొఫెసర్ డీఎస్ రావు మాట్లాడుతూ , విద్యార్థులు మన స్వాతంత్ర్య స్ఫూర్తిని గ్రహించి , ప్రగతిశీల దేశం కోసం నడుం బిగించాలని పిలుపునిచ్చారు . వేడుకలలో పాల్గొన్న వారందరికీ ఆయన తన హృ దయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు . ఈ వేడుకలలో గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ వర్మ , పలువురు డీన్లు , డెరైక్టర్లు , ప్రిన్సిపాళ్ళు , అధ్యాపకులు , విద్యార్థులు , సిబ్బంది , ఉపసిబ్బంది తదితరులు పాల్గొన్నారు . అందరికీ మిఠాయి , ఫలహారాలు , తేనీరును పంపిణీ చేశారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *