పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం 16వ స్నాతకోత్సవ వేడుకను జూలై 19, 2025న (శనివారం) హైదరాబాదు ప్రాంగణంలోని ప్రతిష్టాత్మక శివాజీ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్టు రిజిస్ట్రార్ డాక్టర్ డి. గుణశేఖరన్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్, సైన్స్, ఫార్మసీ, హ్యుమానిటీస్, ఆర్కిటెక్చర్ తో సహా వివిధ విభాగాలలో 2024-25 విద్యా సంవత్సరంలో పట్టభద్రులైన విద్యార్థులు ఈ వేడుకలలో పాల్గొనడానికి అర్హులని ఆయన తెలియజేశారు.అర్హత కలిగిన విద్యార్థులు జూలై 14, 2025వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.మరింత సమాచారం, పేర్ల నమోదు (రిజిస్ట్రేషన్) కోసం విద్యార్థులు గీతం వెబ్ సైట్ www.gitam.edu ను సందర్శించాలన్నారు.