గీతమ్ లో ఉర్రూతలూగించిన డాన్స్ లు

Telangana

– కళ్లు మిరిమిట్లు గొలిపేలా సాగిన ‘స్పిట్ యువర్ గేమ్’

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని కళాకృతి విద్యార్థులు ‘స్పిట్ యువర్ గేమ్’ పేరిట శుక్రవారం: నిర్వహించిన ఒకరోజు స్ట్రీట్ డ్యాన్స్ మహోత్సవాలు యువతను ఉర్రూతలూగించాయి. కళ్లు మిరిమిట్లు గొలిపేలా సాగిన డ్యాన్స్ పోటీలు విద్యార్థులను ఒకచోట నిలువనీయకుండా ఊగిపోయేలా చేశాయి.హెదరాబాద్ లో అంతర్లీనంగా ఉన్న వీథి నృత్యాల సంస్కృతిని వెలుగులోకి తీసుకురావడంతో పాటు, భాగ్యనగరంలోనే ఇటువంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని నిర్వహించిన మొదటి కళాశాలగా గీతమున్ను నిలపడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.
ఈ కార్యక్రమంలో ఉత్కంఠభరితంగా సాగిన నృత్య పోటీలు, మంత్రముగ్ధులను చేసే అద్భుత ప్రదర్శనలు ఆహూతులందరినీ మూగబోయేలా చేశాయి. అత్యున్నత స్థాయి కళాకారులు పాల్గొన్న ఈ కార్యక్రమం భారతదేశం, దాని వెలుపల ఉన్న నృత్య సంస్కృతిని పునర్నిర్వచించేలే చేశాయనడంలో అతిశయోక్తి లేదు. ఆకర్షణీయమైన నృత్యం ప్రదర్శనలు, పోటీల నుంచి, ‘స్పిట్ యువర్ గేమ్’ పట్టణ నృత్య సంస్కృతిని పునరుత్తేజం చేసిన మరపురాని వేడుకగా నిలిచింది.ఈ డ్యాన్స్ పోటీలలో సమకాలీన హిప్-హాప్, వీథి నృత్య శైలి సమ్మేళనంతో తీవ్ర పోటీ కొనసాగింది. ఉత్తమ డ్యాన్సర్లు తమ ఆధిపత్యం నిలుపుకోవడానికి పోరాడారు. ఆకర్షణీయమైన ర్యాప్ ప్రదర్శన విద్యార్థులను బీట్కు అనుగుణంగా నర్తించేలా చేసింది.డ్యాన్స్ ఫ్లోర్లో డ్యాన్సర్లు తమ అత్యుత్తమ ప్రతిభను చూపినప్పుడు ఉత్సాహం, ఉద్విగ్నతలు చోటుచేసు కున్నాయి. మొత్తంగా ఈ వారాంతం స్వచ్చమైన శక్తి, అభిరుచి, విస్మయపరిచే ప్రదర్శనల రోజుగా నిలిచిపోయింది. అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *