అంతర్జాతీయ పత్ర సమీక్ష చేయనున్న గీతం అధ్యాపకుడు

Telangana

మనవార్తలు _పటాన్ చెరు

అమెరికా (ఫ్లోరిడా)లోని గ్రేటర్ మయామిలో వచ్చే ఏడాది ఏప్రిల్లో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సుకు సమర్పించిన పరిశోధనా పత్రాలను సమీక్షించడానికి గీతం అధ్యాపకుడికి అవకాశం లభించింది. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా సేవలందిస్తున్న డాక్టర్ హేమరాజు పొల్లాయి ఈ ప్రతిష్ఠాత్మక సదస్సు సమీక్షకుడిగా ఎంపికయ్యారు.డాక్టర్ హేమరాజు పీహెచ్ఎ పట్టాను మనదేశంలోనే అత్యుత్తము విద్యాసంస్థగా పేరొందిన బెంగళూరులోని ఐఐఎస్సీ నుంచి పొందగా, పోస్ట్-డాక్ డిగ్రీని UtahState-USA నుంచి పూర్తిచేశారు. అడ్వాన్స్డ్ కాంపోజిట్ స్ట్రక్చర్స్ లాబొరేటరీ (ఏసీఎస్ఎల్), ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మోడలింగ్ లాబొరేటరీ (ఏఐ/ఎంఎల్) నుంచి పరిశో ధనా అనుభవాన్ని గడించారు. ఈ రంగంలో ఆయనకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని విశ్వవ్యాప్త విద్యాధికులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు సమర్పించిన పరిశోధనా పత్రాలను సమీక్షించే గౌరవం డాక్టర్ హేమరాజుకు లభించింది.విశ్వవ్యాప్తంగా ఉన్న నిపుణులకు ఒకచోటకు చేర్చే లక్ష్యంతో ‘పోటీ వాతావరణంలో ఇంజనీరింగ్, సెన్ట్స్, కన్స్ట్రక్షన్, ఆపరేషన్స్ (భూమి-ఆకాశం 2024) 19వ ద్వైవార్షి అంతర్జాతీయ సదస్సు’ను అమెరికా (ఫ్లోరిడా)లోని గ్రేటర్ మయామిలో 2024 ఏప్రిల్ 15-18 తేదీలలో నిర్వహిస్తున్నారు. శాస్త్ర, సాంకేతిక, నిర్మాణం, భూమి, చంద్రుడు, అంగారక గ్రహం వెలుపల ఉన్న తీవ్ర వాతావరణాలపై అత్యాధునిక పురోగతిని వివిధ విభాగాల నిపుణులు ఈ సదస్సులో సమీక్షించనున్నారు. సివిల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, భూమి, అంతరిక్షంలోని తీవ్ర వాతావరణాలలో నెట్వర్కింగ్, జ్ఞానాన్ని పంచుకోవడానికి అసాధారణ వేదికగా ఈ సదస్సు ఉపకరించనుంది.డాక్టర్ హేమరాజుకు లభించిన ఈ అరుదెన అవకాశం, గుర్తింపు, గౌరవాల పట్ల పలువురు గీతం ఉన్నతాధికారులు, సహోధ్యాపకులు హర్షం వెలిబుచ్చడంతో పాటు ఆయనను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *