-పర్యావరణ హిత తయారీ పద్ధతుల పరిశీలన
-స్వాగతించి, వివరాలు తెలియజేసిన హింద్ వేర్ సీనియర్ మేనేజర్ సురేష్ కుమార్
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లోని ఏడవ సెమిస్టర్ విద్యార్థులు మంగళవారం ఇస్నాపూర్ లోని హింద్ వేర్ ఫ్యాక్టరీని సందర్శించి, వారి ట్రూఫ్లో ఉత్పత్తులతో సహా పర్యావరణ హిత తయారీ పద్ధతుల గురించి అవగాహన ఏర్పరచుకున్నారు. తమ పాఠ్యాంశాలలో భాగమైన వర్కింగ్ డ్రాయింగ్ లపై దృష్టి సారించడమే గాక, ఆర్కిటెక్చరల్ మెటీరియల్స్ ఆచరణాత్మక వినియోగ విధానాలను స్వయంగా గ్రహించారు. మరీ ముఖ్యంగా ఐజీబీసీ ప్లాటినం రేటింగ్ పొందిన పర్యావరణ హిత తయారీ పద్ధతుల గురించి తెలుసుకున్నారు. పర్యావరణ స్థిరత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో సమకాలీన ఆర్కిటెక్చర్ లో అవసరమైన అంశాలు, స్థిర తయారీ పద్ధతులు, డిజైన్ ప్రక్రియలపై లోతైన అవగాహన ఏర్పరచుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు మట్టి, వ్యర్థాలు, వర్షం పైపులను, వాటి విభిన్న విధులు, నిర్మాణ రూపకల్పనలో తీసుకుంటున్న మెళకువలను పరిశీలించారు. పీవీసీ. యూపీవీసీ, సీపీవీసీతో సహా వివిధ రకాల పైపుల క్లిష్టమైన తయారీ ప్రక్రియలను వీక్షించారు. నిర్మాణ పదార్థాలపై లోతైన అవగాహనను వారు పెంపొందించుకున్నారు.హింద్ వేర్ లిమిటెడ్ సినియర్ మేనేజర్ సురేష్ కుమార్ తన నైపుణ్యాన్ని, విస్తృత అవగాహనను విద్యార్థులతో పంచుకున్నారు. గీతం అధ్యాపకులు ముక్తీశ్వర్, జబ్బార్ అహ్మద్, స్నిగ్ధ రాయ్ తదితరులు విద్యార్థులకు పరిశ్రమ సందర్శన అనుభవాన్ని అందించారు.ఈ పారిశ్రామిక సందర్శన తమ విద్యార్థుల విద్యా ప్రయాణంలో ఒక మైలురాయని, ఇది వాస్తుశిల్పంలో స్థిరమైన రూపకల్పన పద్ధతుల ప్రాముఖ్యతను బలపరుస్తుందని ముక్తీశ్వర్ అభిప్రాయపడ్డారు. హింద్ వేర్ యాజమాన్యానికి గీతం తరఫున కృతజ్జతలు తెలియజేశారు.