క్రీడల్లో ప్రతిభ చాటిన గీతం విద్యార్థులు

Telangana
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ లోని విద్యార్థులు క్రీడా పోటీలలో తమ ప్రతిభ చాటి అసాధారణ విజయాలను సాధించారు. స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్లోని బీఏ సెక్షాలజీ విద్యార్థిని అనఘా పాయ్ ప్రతిష్ఠాత్మక ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్-2023 మహిళల డబుల్స్ విభాగంలో మూడవ స్థానాన్ని సాధించింది. ఆమె అద్భుత ప్రదర్శన, దృఢ సంకల్పం ఆమెకు ఈ విజయాన్ని సాధించి పెట్టాయి.మరోవైపు గీతం హెదరాబాద్ క్రికెట్ జట్టు అత్యంత పోటీతత్వంతో కూడిన EKALAVYA-2023 పేరిట హెదరాబాద్ లోని ఎంజీఐటీ కళాశాల నిర్వహించిన అంతర్ కళాశాలల క్రీడా పోటీలలో విజేతగా నిలిచి, తొలి స్థానాన్ని కెవసం చేసుకుంది. జట్టు అసాధారణ నైపుణ్యాలు, కృషి, అంకితభావం వారిని ఉన్నత స్థాయికి చేర్చి, క్రికెట్ రంగంలో గీతము ఓ శక్తిగా మార్చింది. అటు విద్యతో పాటు ఇటు క్రీడలలో కూడా రాణించడం ద్వారా గీతం విద్యార్థులు తమ అంకితభావం, ప్రతిభ, కృషిని ప్రదర్శించారు.

గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, వివిధ స్కూళ్ళ అధినేతలు, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పలువురు విజేతలుగా నిలిచిన అనఘా పాయ్కి, గీతం హెదరాబాద్ క్రికెట్ బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. వారి అద్భుత విజయం విశ్వవిద్యాలయానికి గౌరవం, గుర్తింపును తీసుకురావడమే గాక, గీతమ్లోని ఔత్సాహిక క్రీడాకారులందరికీ ప్రేరణగా నిలిచిందన్నారు.విద్యార్థుల సమగ్రాభివృద్ధిని గీతం డీమ్డ్ వర్సిటీ ప్రోత్సహించడమే గాక, అత్యాధునిక సౌకర్యాలు, అంకిత భావం, నిబద్ధతతో కూడిన అధ్యాపకుల సహకారంతో, విద్యార్థులు వివిధ రంగాలలో రాణించడానికి తోడ్పడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *