మొదటి బహుమతి కైవసం – ట్రోఫీతో పాటు నగదు పురస్కారం
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియల్ డిజైనర్స్ (ఐఐఐడీ) హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ విద్యార్థులు తమ అసాధారణ ప్రతిభను, సృజనాత్మకతను సగర్వంగా ప్రదర్శించి పలువురు మన్ననలను అందుకున్నారు. ప్రఖ్యాత డిజైనర్ గీత బాలకృష్ణన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పలువురు నిపుణులు ఉత్సాహంగా పాల్గొని, హైదరాబాద్ లోని డిజైన్ కమ్యూనిటీ ఐక్యతను చాటిచెప్పారు.గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డైరెక్టర్ బందన్ కుమార్ మిశ్రా, అధ్యాపకులు అభిషేక్ కుమార్ సింగ్, స్నిగ్దా రాయ్ లతో పాటు విద్యార్థులు అనుశ్రీ కలకుంట్ల, భవ్యరెడ్డి, సూర్యకుమారి తదితరులు ప్రాతినిధ్యం వహించారు.ప్రాథమిక దశలోనే అత్యంత ప్రతిభ కనబరిచిన భవ్యరెడ్డి, స్నిగ్ద రాయ్ బృందం, ప్రతిష్టాత్మక తుది పోటీకి చేరుకుని మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు. విజేతలుగా ట్రోఫీతో పాటు పది వేల రూపాయల నగదు పురస్కారాన్ని వారు అందుకున్నారు.ఐఐఐడీ వ్యవస్థాపక దినోత్సవం ఇంటీరియర్ డిజైన్ కమ్యూనిటీలోని అసాధారణమైన ప్రతిభకు నిదర్శనంగా నిలవడమే గాక, గీతం యొక్క విజయాలు ప్రముఖంగా నిలిపాయి. ఇందులో పాల్గొన్న వారందరూ ప్రదర్శించిన అంకితభావం, సృజనాత్మకత, ఆవిష్కరణలు, ఇంటీరియర్ డిజైన్ లో స్నేహం, శ్రేష్ఠత స్ఫూర్తిని పెంపొందించాయి.ఈ కార్యక్రమం గీతం, విస్తృత డిజైన్ కమ్యూనిటీ మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేయడమే గాక, ఇంటీరియర్ డిజైన్ విద్యలో సృజనాత్మకత, శ్రేష్ఠతను పెంపొందించడంలో విశ్వవిద్యాలయ తిరుగులేని నిబద్ధతను చాటి చెబుతోంది.