పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థులు హైదరాబాద్ లోని ఒక బహుళజాతి ఫార్మాస్యూటికల్ కంపెనీ శరణ్ కెమికల్ టెక్నాలజీలో పరిశోధన- అభివృద్ధి (ఆర్ అండ్ డీ), అనలిటికల్ రీసెర్స్ అండ్ డెవలప్మెంట్ (ఏఆర్ అండ్ డీ) సౌకద్యాలను సందర్శించారు. పరిశ్రమల గురించి, ఔషధ కార్యకలాపాలపై లోతెన అవగాహనను ఏర్పరచడానికి గీతం ఈ పర్యటనను ఏర్పాటు చేసింది.సందర్శన సమయంలో విద్యార్థులు శరణ్ కెమికల్ టెక్నాలజీలోని పరిశ్రమ నిపుణులతో సంభాషించారు. వివిధ ల్యాబ్ లు, ఉత్పత్తి యూనిట్లు, నాణ్యత నియంత్రణ విధానాలు, పరిశోధన-అభివృద్ధి కార్యకలాపాల పనితీరుతో సహా ఔషధ పరిశ్రమ ఒక అవగాహనకు వచ్చారు. తమకున్న సందేహాలను అడిగి నిన్పత్తి చేసుకుంటూ పరిశ్రమ పనితీరును బేరీజు వేసుకున్నారు. ఇటువంటి విద్యా సంబంధ పర్యటనలు తనుకు ఎంతో ఉపకరిస్తున్నాయని. విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ పారిశ్రామిక సందర్శనను ఫార్మసీ అధ్యాపకులు డాక్టర్ గూడి శ్రీకాంత్, డాక్టర్ ప్రియాసింగ్ సమన్వయం చేశారు. ఇది విద్యార్థులకు మంచి అనుభవాన్ని అందిస్తుందని వారు అభిప్రాయపడ్డారు.