మనవార్తలు ,పటాన్ చెరు:
గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి బ్రిటన్‌లోని నాటింగ్‌హామ్ విశ్వవిద్యాలయం సౌజన్యంతో నాలుగేళ్ళ బీఎస్సీ ఫుడ్ సెన్స్ అండ్ టెక్నాలజీ కోర్సును నిర్వహించనున్నారు . ఈమేరకు నాటింగ్హాహామ్ వర్సిటీకి చెందిన భాగస్వామ్య సంబంధాలు , ప్రాజెక్టుల విభాగాధిపతి అన్నే యిమెంగ్ ఆన్‌తో బుధవారం ప్రాథమిక చర్చలు జరిగాయి . ఈ కోర్సులో చేరిన విద్యార్థులు రెండేళ్ళ పాటు గీతమ్ , ఆ తరువాత బ్రిటన్‌లో విద్యాభ్యాసం చేసేలా ఒప్పందం కుదుర్చుకోవాలని సంకల్పించారు . ముందుగా , పాఠ్యాంశాలను ఖరారు చేయాలని , రెండు సంస్థల ప్రమాణాలకు సరిపోయేలా బ్రిడ్జ్ కోర్సును రూపొందించి , , అపెన ఒక అవగాహనా ఒప్పందాన్ని ( ఎంవోయూ ) కుదుర్చుకోవాలని నిర్ణయించారు .
అంతే కాకుండా , ఫుడ్ సెన్స్ అండ్ టెక్నాలజీలో పరిశోధనా కార్యకలాపాలలో కూడా తగిన సహాయ సహకారాలు అందజేసుకోవాలనే ఆసక్తిని ఉభయ పక్షాలూ కనబరిచాయి . గీతం స్కూల్ ఆఫ్ సెన్ట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె.నగేష నేతృత్వంలోని ఫుడ్ సెన్స్డ్ అధ్యాపకులు ప్రొఫెసర్ ఉమా మహేశ్వరి , డాక్టర్ అజయ్ కుమార్ స్వర్ణాకర్ , మౌమితా దేవ్ , జి . నిహారిక , పరుల్ థాపర్లు ఈ ప్రాథమిక చర్చలు నిర్వహించారు . గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగం ప్రొఫెసర్ పి.త్రినాథరావు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు . కాగా , ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ విశ్వవిద్యాలయంతో కలిసి గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ సంయుక్తంగా బీఎస్సీ ( బ్లెండెడ్ ) కోర్సును 2019 నుంచి నిర్వహిస్తున్న విషయం విదితమే .