Hyderabad

ప్రకాష్ నగర్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన కాలనీ ముఖద్వారం

హఫీజ్ పెట్:

హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ప్రకాష్ నగర్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన కాలనీ ముఖద్వారం (కమాన్) ను కార్పొరేటర్లు పూజితజగదీశ్వర్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్ల్ లతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ మాట్లాడుతూ ప్రకాష్ నగర్ కాలనీ కి రెండు వైపుల ముఖ ద్వారాలు (కమాన్ ) పెట్టడం చాలా అభినందనియం అని, కాలనీ కి వచ్చే కొత్త వ్యక్తులకు స్వాగతం పలుకుతూ ఒక తోరణం లాగా ముఖద్వారాలు పనిచేస్తాయని, కాలనీ లకు గుర్తుగా, ఒక చిరునామా గా పని చేస్తాయని , ముఖ ద్వారాలు కాలనీ ల స్వరూపాన్ని తెలియచేస్తాయని అన్నారు. ప్రకాష్ నగర్ కాలనీ లో ముఖ ద్వారాలు ఏర్పాటు చేసిన బాలింగ్ గౌతమ్ గౌడ్ ను మరియు పులి అరుణ శ్రీనివాస్ గౌడ్ ల ను ప్రత్యేకంగా అభినదించండం జరిగినది. కాలనీ ప్రధాన రోడ్డు వైపు హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షలు బాలింగ్ గౌతమ్ గౌడ్ తండ్రి కీ. శే శ్రీ బాలింగ్ సత్తయ్య గౌడ్ గారి జ్ఞాపకార్థం ముఖద్వారం ఏర్పాటు చేశారు. కాలనీ కి మరో వైపు మంజీర రోడ్డు లో పులి అరుణ శ్రీనివాస్ గౌడ్ ల కుమార్తె కీ.శే దివ్య జ్ఞాపకార్థం ముఖద్వారం ను ఏర్పాటు చేయడం అభినందించ దగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్ , ప్రకాష్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి, జనరల్ సెక్రటరీ రాజేశ్వర్ రావు, రమేష్ గౌడ్, బెనర్జీ, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

56 minutes ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

1 hour ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

1 hour ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago