మనవార్తలు, శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గం, శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ డాక్టర్ ప్రియాంక అల ను గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జోనల్ కమిషనర్ తో సమావేశమై గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్పల్లి,గోపన్పల్లి తండా, ఇందిరానగర్, కేశవనగర్, నేతాజీ నగర్, రాయదుర్గం, గౌలిదొడ్డి నల్లగండ్ల, లలో డ్రైనేజీ సమస్యను, నీటి సమస్యలను మరియ రోడ్లు, పరిష్కారానికి మార్గం చూపు వలసిందిగా కోరడం జరిగింది.
అనంతరం బసవతారకానగర్ లో నీటి సమస్యలను పరిష్కరించాలని కోరడం జరిగింది . అనంతరం జోనల్ కమిషనర్ డాక్టర్ ప్రియాంక అల కు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.