నకిలీ భూడాక్యుమెంట్లు సృష్టించిన ముఠాఅరెస్ట్

Districts politics Telangana

మనవార్తలు,పటాన్చెరు:

చనిపోయిన వ్యక్తి పేరును వాడుకుంటూ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూవిక్రయాలు చేస్తూ కోట్లాది రూపాయాల అక్రమాలకు పాల్ప డుతున్న ఘరానా ముఠా సభ్యులను పోలీసులు చాకచక్యంగా అదుపు లోకి తీసుకున్నారు, వారి వద్ధ నుండి 27 లక్షల 56వేల రూపాయల నగదు ను స్వాధీనం చేసుకొని నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు. పటాన్ చెరు డీఎస్పీభీంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పటాన్ చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ శివారులోని సర్వేనెంబర్ 251 లోని దాదాపు 880 చదరపు గజాల స్థలం మధీనా గూడకు చెందిన యం.సునంద 2000సంవత్సరంలో కొనుగోలు చేసింది. కాగా ఇటీవల తన స్ధలాన్ని కొందరు కబ్జా చేసి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయటంతో ఆమె పటాన్ చెరు పోలీసులను ఆశ్రయించింది.

అయితే నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి లక్ష్మారెడ్డి, ఖలీల్,చంద్రశేఖర్ రెడ్డి అభయ్ , చాకలి గణేష్, ప్రవీణ్ రెడ్డి, అనంత, శివ , ప్రకాష్ లు పధకం ప్రకారం చనిపోయిన స్ధానిక నేత జైపాల్ రెడ్డి పేరును వాడుకుంటూ సదరు స్ధలాన్ని నకిలీ పత్రాలు, ఆధార్ కార్డు లు సృష్టించి దాదాపు ఐదు కోట్లకు ఇస్నాపూర్ కు చెందిన మహ్మద్ ఆలికి విక్రయించారు. అడ్వాన్స్ గా కోటి ఇరవై ఏడు లక్షలు కూడా తీసుకుని నిందితులు పంచుకున్నారు. కాగా సునంద ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి కేసును దర్యాప్తు చేయటంతో అసలు నిజాలు నిగ్గు తేల్చారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ప్లాట్లను విక్రయిస్తున్న ముఠా సభ్యులు తొమ్మిది మందిలో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వద్ద నుంచి 27లక్షల 56వేల నగదును స్వాధీనం చేసుకున్నామని, ప్రధాన నిందితులన లక్ష్మారెడ్డి,ఖలీల్, శివలను త్వరలోనే పట్టుకుంటామని  డీఎస్పీభీంరెడ్డి వెల్లడించారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *