– గణేష్ మండపం వద్ద అన్న ప్రసాద వితరణ
మనవార్తలు ప్రతినిధి,అల్లాదుర్గం :
గణేష్ నవరాత్రుల సందర్బంగా అల్లాదుర్గం శ్రీ పోచమ్మ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ప్యారారం సునీత నర్సింలు, బుగుడాల లక్ష్మి భాగయ్య దంపతులు అన్నదాన ప్రసాద వితరణ చేసి భక్తులకు వడ్డీంచారు. అన్నదాతలు మాట్లాడుతు గణేష్ నవరాత్రులు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని, పర్యావరణ గణపతులను పూజించి ప్రకృతి ని కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గణేష్ కమిటీ సభ్యులు, భజన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.