పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
పటాన్‌చెరు మండలం పాటి గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగాయి. బుధవారం రాత్రి పాటి గ్రామంలోని హనుమాన్ మందిరం వద్ద నెలకొల్పిన గణేష్ లడ్డు వేలంపాట కొనసాగింది. ఈ యొక్క వేలంపాటలో పాటి గ్రామ సర్పంచ్ మున్నూరు లక్ష్మణ్ రూ.11 లక్షల 1 రూపాయికి కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మున్నూరు లక్ష్మణ్ మాట్లాడుతూ… పాటి గ్రామంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే గ్రామస్తులు అందరం కలిసి గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుపుకున్నామని అన్నారు. కులమతాలకు అతీతంగా గణేష్ ఉత్సవాలతో పాటు ప్రతి పండుగలను గ్రామస్తులందరం కలిసిమెలిసి జరుపుకుంటున్నట్లు తెలిపారు. వినాయకుడి కృపతో గ్రామస్తులందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, గ్రామం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.