గణేశ్ లడ్డూ రూ.2,65,666 వేలు…
పటాన్‌చెరు :
పటాన్ చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామం సిటిజెన్ కాలనీలో సిటిజన్ యూత్ అండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపం వద్ద లడ్డూ ప్రసాదం వేలం పాటను ఆదివారం నిర్వహించారు . పోటాపోటీగా సాగిన వేలంలో రామేశ్వరంబండ కు చెందిన ఐలాపురం నాగరాజ్ ముదిరాజ్ రూ.2,65,666 వేల రూపాయిలకు లడ్డూను దక్కించుకున్నారు.
వేలంలో లడ్డును దక్కించుకోవడంతో పుణ్యంగా భావిస్తున్నామని నాగరాజు ముదిరాజ్ సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సిటిజన్ యూత్ అండ్ అసోసియేషన్ సభ్యులు లడ్డూ సొంతం చేసుకున్న నాగరాజు ను శాలువతో సత్కరించి , లడ్డూను అందజేశారు . యూత్ సభ్యులు దిలీప్ ముదిరాజ్ ,మహేష్ ,భాస్కర్ సాయి సుమంత్, భాస్కర్ రెడ్డి , వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.