కన్నుల పండువగా సాగిన గణేష్ గడ్డ లడ్డు వేలం…
– మూడు లడ్లు 9.60 లక్షలు
పటాన్ చెరు:
పటాన్ చెరు మండల పరిధిలోని రుద్రారం గ్రామం సమీపంలోని గణేష్ గడ్డ దేవాలయంలో లడ్డూ ప్రసాదం వేలం పాటను ఆదివారం రాత్రి నిర్వహించారు . పోటాపోటీగా సాగిన వేలంలో మూడు లడ్డూలు వేలం పాటలో 9.60 లక్షలకు పాడుకున్న భక్తులు. తొలి లడ్డు 6 లక్షలకు రుద్రారం గ్రామానికి చెందిన సాబాద సాయికుమార్ దక్కించుకోగా, రెండవ లడ్డును రామచంద్రపురం మండలం నాగులపల్లి చెందిన సాయి చరణ్ గౌడ్ 2.1 లక్షలకు, మూడో లడ్డు 1.5 లక్షలకు రుద్రారం గ్రామానికి చెందిన నారాయణ దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా లడ్లను దక్కించుకున్న వారు మాట్లాడుతూ… లడ్లు దక్కించుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. అనంతరం ఆలయ ఈవో, గ్రామ సర్పంచ్ లడ్డు దక్కించుకున్న వారిని సన్మానించి లడ్డు అందజేశారు.