రాజ్య స‌భ స‌భ్యులు , ఓబీసీ మోర్చా జాతీయ అధ్య‌క్షుల డాక్ట‌ర్ కె.ల‌క్ష్మ‌ణ్ కు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికిన గ‌డీల శ్రీకాంత్ గౌడ్

politics Telangana

మనవార్తలు ,పటాన్ చెరు:

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకురావ‌డానికి ప్ర‌తి కార్య‌క‌ర్త కృషి చేయాలని రాజ్య స‌భ స‌భ్యులు , ఓబీసీ మోర్చా జాతీయ అధ్య‌క్షుల డాక్ట‌ర్ కె.ల‌క్ష్మ‌ణ్ అన్నారు. వికారాబాద్ జిల్లా మారేప‌ల్లి ప్ర‌జా గోస బీజేపీ భ‌రోసా కార్య‌క్ర‌మంలో పాల్గొని తిరిగి హైద‌రాబాద్ కు వెళ్ళున్న ల‌క్ష్మ‌ణ్ కు ఇస్నాపూర్ లో బీజేపీ నేత‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం విలేక‌ర్ల‌తో ఆయ‌న మాట్లాడుతూ స్థానిక సమస్యలను గుర్తించటం, వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టడం కోసం బీజేపీ ప్ర‌జాగోస బీజేపీ భ‌రోసా కార్య‌క్ర‌మం చేప‌ట్టింద‌న్నారు .గ్రామాల్లో నెల‌కొన్న సమస్యల పరిష్కారం కోసం ప్రజలకు భరోసా ఇవ్వడమే ఈ కార్య‌క్ర‌మం ముఖ్య ఉద్దేశం అన్నారు .

_దేవీ న‌వ‌రాత్రి ఉత్స‌వాల్లో పాల్గొన్న రాజ్య‌స‌భ స‌భ్యుడు డాక్ట‌ర్ కె.ల‌క్ష్మ‌ణ్

ఇస్నాపూర్ బీజేపీ కార్యాల‌యంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గ‌డిల శ్రీకాంత్ గౌడ్ ఎంపీ డాక్ట‌ర్ కె.లక్ష్మ‌ణ్ కు అల్పాహారం ఏర్పాటు చేశారు. దేవీ న‌వ‌రాత్రుల్లో భాగంగా ఇస్నాపూర్ ప‌ద్మారావు న‌గ‌ర్ కాల‌నీలో తెలంగాణ భ‌వ‌న నిర్మాణ కార్మికుల ఆధ్వ‌ర్వంలో ఏర్పాటు చేసిన అమ్మ‌వారి విగ్ర‌హానికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. దేవీ న‌వ‌రాత్రి ఉత్స‌వాల్లో పాల్గొని అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.ఈ కార్య‌క్ర‌మంలో పటాన్ చెరు మాజీ జడ్పిటిసి, బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ తో పాటు తెలంగాణ భవన నిర్మాణ , కార్మిక సంఘాల‌ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చిన్నారావు, బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సంజయ్ గనాటే, బిజెపి రాష్ట్ర నాయకులు వీరమల్ల అనిల్ గౌడ్, రవీందర్, మరియు ట్రేడ్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు ఎస్.ఆర్.కే యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *