పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంతో రాజమండ్రిలోని ఐసీఎస్ఈ అనుబంధ పాఠశాల ఫ్యూచర్ కిడ్స్ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు ఉపకులపతి ప్రొఫెసర్ దయానంద సిద్ధవట్టం శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఫ్యూచర్ కిడ్స్ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ఉన్నత విద్య ను అందించడం, మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా వారిని సన్నద్ధం చేయడం లక్ష్యంగా ఈ అవగాహన కుదిరిందన్నారు. తన సమక్షంలో జరిగిన ఈ అవగాహనా ఒప్పందంపై గీతం రిజిస్ట్రార్ డి.గుణశేఖరన్, ఫ్యూచర్ కిడ్స్ పాఠశాల ముఖ్య కార్యనిర్వహణాధి కారి ఏలేటి రుద్రశ్రీ మహస్వి సంతకాలు చేసినట్టు తెలియజేశారు. క్లిష్టమైన ఆలోచనా నైపుణ్యాలకు ఫ్యూచర్ కిడ్స్ ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దడంలో పేర్గాంచిందన్నారు. గీతమ్ తో ఈ సహకారం, విద్యార్థులు ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు సాఫీగా మారేలా చేస్తుందని తెలిపారు. ఫ్యూచర్ కిడ్స్ లోని త్రిభాషా పద్ధతికి, గీతం ఆంగ్ల మాధ్యమ బోధన తోడె ప్రపంచ అవసరాలను అనుగుణంగా విద్యార్థులను సన్నద్ధం చేస్తుందని వీసీ అభిలషించారు, ఫ్యూచర్ కిడ్స్ అత్యుత్తము ప్రతిభ కనబరిచిన విద్యార్థులు గీతం వర్సిటీలోని పలు కోర్సులు, విభాగాలలో అందిస్తున్న ఉపకార వేతనానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. రెండు సంస్థల అనువర్తిత అభ్యాసం గీతమ్ కి సూడే విద్యార్థులకు విద్యా ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని, అభ్యాస శైలిలో గణనీయమైన సర్దుబాట్ల అవసరాన్ని తొలగిస్తుందని డాక్టర్ దయానంద తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఫ్యూచర్ కిడ్స్ ప్రిన్సిపాల్ శేష గిరిధర్, అకడమిక్ హెడ్ హర్షిణి, గీతం విశాఖపట్నం అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ వై . గౌతమరావు, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ నిర్మలరావు తదితరులు పాల్గొన్నారు .
గీతమ్ లో రక్తదాన శిబిరం
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం,హైదరాబాద్ లోని డైరక్ట రేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) సంయుక్తంగా శుక్రవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు . ఎన్టీఆర్ రక్త నిధి సౌజన్యంతో, రక్తదానాన్ని ప్రోత్సహించడం, క్లిష్టమైన పరిస్థితులలో ప్రాణాన్ని కాపాడడం లక్ష్యంగా ఈ శిబిరాన్ని నిర్వహించారు.ఈ శిబిరంలో 61 యూనిట్ల రక్తాన్ని విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది దానం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కొందరు విద్యార్థులు స్వచ్ఛందంగా సహాయకులుగా పనిచేసి, కీలక పాత్ర పోషించారు. రక్తదానం చేసిన వారికి పళ్లరసం, బిస్కెట్లను అందించారు.విద్యార్థుల నిస్వార్థ సహకారానికి ప్రశంసా పూర్వక ధృవీకరణ పత్రాలను ఎన్టీఆర్ రక్తనిధి కేంద్రం వారు అందజేసి, సమాజానికి వారు చేసిన సేవను అభినందించారు.