నిధులు పుష్కలం. -ప్రతిపాదనే ఆలస్యం

politics Telangana

_సృష్టీకరించిన కేంద్ర ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ మహమ్మద్ అస్లాం 

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

ఏ విద్యా సంస్థలోని అధ్యాపకులన ఫలానా అంశంపై పరిశోధన చేపడతామని, అందుకు తగ్గ అర్హతలను చూపుతూ ప్రతిపాదనలు పంపితే, దానికి అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని భారత శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ పూర్వ సలహాదారు, బయోటెక్నాలజీ (డీబీటీ) కన్సల్టెంట్ డాక్టర్ మహమ్మద్ అస్లాం చెప్పారు. హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘టీబీటీలో. పరిశోధన-అభివృద్ధికి నిధుల లభ్యత అవకాశాలు’ అనే అంశంపై మంగళవారం ఆయన అధ్యాపకులతో ముఖాముఖి నిర్వహించారు.

ఒక పరిశోధనా ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ నిధులను సాధించుకోవాలంటే, ముందుగా ప్రాజెక్టు ప్రతిపాదన చాలా ముఖ్యమైనదని, దాని గురించి విడమరిచి చెప్పగలగాలని ఆయన స్పష్టీకరించారు. ఓ ప్రాజెక్టుకు నిధుల ప్రతిపాదన వచ్చినప్పుడు నిపుణుల కమిటీ ఆ ప్రాజెక్టు పేరు, దాని లక్ష్యాలను మాత్రమే కాకుండా సాధ్యాసాధ్యాలు, పరిశోధనాంశాన్ని ఎలా నిర్వచించారు వంటివన్నీ ముందుగా పరిశీలిస్తారని చెప్పారు. పరిశోధనలకు విధులను సమకూర్చే ఏ ప్రభుత్వ సంస్థ అయినా ముందుగా ఆసక్తి వ్యక్తీకరణను ఆహ్వానిస్తుందని, ఆ ప్రతిపాదన చేసిన వ్యక్తి ఏమి చదివారు, ఎన్ని పరిశోధనా పత్రాలను ప్రచురించాడు వంటివన్నీ పరిశీలించాకే ప్రజెంటేషన్ కోసం ఆహ్వానిస్తామన్నారు. ప్రస్తుతం బయోటెక్నాలజీ అనేది అంతర్ విభాగ అంశంగా పరిణమించిందని, బయో ఫిజిక్స్, కెమిస్ట్రీలతో పాటు ఇంజనీరింగ్ విభాగాల సహకారం కూడా అవశ్యమని చెప్పారు.

-పరిశోధనా ప్రాజెక్టులను రూపొందించడానికి ఆయా విద్యా సంస్థలలో సొంత యంత్రాంగం ఉండాలని, ఆలోచనలను ప్రేరేపించే సమావేశాలను తరచుగా నిర్వహించాలని, అంతర్ విభాగ అధ్యాపకుల మధ్య చర్చలు, సూచనలు, సలహాలు తీసుకోవాలని డాక్టర్ అస్లాం సూచించారు. తొలుత, గీతం పరిశోధన-అభివృద్ధి విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ గణపతి అతిథిని స్వాగతించి, సదస్యులకు పరిచయం చేయగా, స్కూల్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె.నగేష్ వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది. గీతలోని వివిధ విభాగాలకు చెందిన పరిశోధనలు చేపట్టాలనే ఆసక్తి ఉన్న అధ్యాపకులు పలువురు ఈ ముఖాముఖిలో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *