మానసిక ప్రశాంతతకు నిలయాలు దేవాలయాలు
మనవార్తలు , పటాన్ చెరు
నియోజకవర్గం లోని పురాతన ఆలయాల జీర్ణోర్ధరణకు సంపూర్ణ సహకారం అందించడంతో పాటు నూతన ఆలయాల నిర్మాణాలకు కృషి చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని గొల్ల బస్తీలో నూతనంగా నిర్మించిన శ్రీ రామలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట, ధ్వజ స్తంభ ప్రతిష్టాపన సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజ, హోమం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, విజయ్ కుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.
పాటి గ్రామంలో
పటాన్చెరు మండలం పాటి గ్రామంలో నూతనంగా నిర్మించిన తలపెట్టిన పోచమ్మ తల్లి దేవాలయం భూమి పూజ కార్యక్రమం లో పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మానసిక ప్రశాంతతకు నిలయాలు దేవాలయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మణ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, భూపాల్ రెడ్డి, స్వామి గౌడ్, గ్రామ పుర ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.