పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని నర్ర బస్తిలో గల హనుమాన్ దేవాలయం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం స్థానికులతో కలిసి హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం కాలనీవాసులతో సమావేశమయ్యారు. పురాతన ఆలయాలను జీర్ణోద్ధరణ చేసేందుకు ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. హనుమాన్ దేవాలయం ఆధీనంలో గల భూమిలో భవనాన్ని నిర్మించి, ఆదాయం సమకూర్చేలా కృషి చేస్తామని తెలిపారు. శాశ్వత ప్రాతిపదికన ధూప దీప నైవేద్యాలకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు. మున్నూరు కాపు సంఘం స్మశాన వాటికకు ప్రహరీ గోడ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని జిహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సంగం సీనియర్ నాయకులు నాయికోటి రాజు, కాసాల సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
