పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
భారతీయ జనతా పార్టీ మతోన్మాద కార్పోరేట్ విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన చైతన్య యాత్ర కు సంపూర్ణ మద్దతు అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం సిపిఎం పార్టీ బృందం సభ్యులు జన చైతన్య యాత్ర కు హాజరుకావాలని కోరుతూ ఎమ్మెల్యే జిఎంఆర్ కు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈనెల 25వ తేదీ సాయంత్రం 5 గంటలకు సంగారెడ్డి ఊర్లో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో చైతన్య యాత్ర ముగింపు సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు.