పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :
సిగాచి పరిశ్రమ కార్మికుల కుటుంబాలకు పూర్తిస్థాయి నష్టపరిహారము చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఇస్నాపూర్ మున్సిపల్ కార్యాలయంలో సిగాచి పరిశ్రమలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు డెత్ సర్టిఫికెట్లు ఇప్పించడం జరిగింది. ఈ సందర్భంగా నాగేశ్వరావు మాట్లాడుతూ సిగాచి పరిశ్రమలో ఇప్పటివరకు 25 లక్షల నష్టపరిహారం మాత్రమే ఇవ్వడం జరిగిందన్నారు. పరిశ్రమలో ప్రమాదం సంభవించి ఆరు నెలలు పూర్తవుతున్న ఇప్పటివరకు మిగతా 75 లక్షల నష్టపరిహారము ఎందుకు చెల్లించడం లేదని పరిశ్రమ యాజమాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పరిశ్రమ యాజమాన్యాన్ని సీఈఓ అమిత్ రాజును అరెస్టు చేసి రిమాండ్ కు పంపించడం జరిగిందని, ఆరు నెలలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయల మాట గాలి మాటగా మారిందన్నారు. గత ఆరు నెలలుగా సీఐటీయూ ఆధ్వర్యంలో కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రతి ఒక్కరికి ఇస్నాపూర్ మున్సిపల్ కార్యాలయం నుండి డెత్ సర్టిఫికెట్లు ఇవ్వాలని సిఐటియు డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పూర్తిగా నష్టపరిహారం చెల్లించేంతవరకు కార్మికుల పక్షాన ఉండి సిఐటియు నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు నల్లగండ్ల రాజు, కార్మికుల కుటుంబాలు పాల్గొన్నారు.
