_రుద్రారం ప్రీమియర్ లీగ్ పోటీలు ప్రారంభం..
పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే క్రీడా పోటీల ద్వారా వాతావరణం వెల్లివిరిస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో ఏర్పాటు చేసిన రుద్రారం ప్రీమియర్ లీగ్ సీజన్ 4 క్రికెట్ పోటీలను శనివారం ఆయన లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించడంతో పాటు క్రీడాకారుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని ,ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం పెంచేలా వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎంపీటీసీలు మన్నే రాజు, హరి ప్రసాద్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.