గీతమ్ లో ఘనంగా ‘ఫ్రెషర్స్ డే’ వేడుకలు

Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ప్రాంగణంలో ఫ్రెషర్స్ పార్టీని ఘనంగా నిర్వహించారు. టెక్నాలజీ, మేనేజ్ మెంట్, సైన్స్ , ఫార్మసీ, ఆర్కిటెక్చర్, హ్యుమానిటీస్ లలో 2024-25 విద్యా సంవత్సరంలో కొత్తగా చేరిన విద్యార్థుల కోసం సీనియర్ విద్యార్థులు దీనిని ఏర్పాటు చేశారు.నూతన విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం, వారిలోని సృజనాత్మకతను వెలికితీసి, విద్యార్థుల మధ్య స్నేహాన్ని పెంపొందించి, వారంతా తమ స్వగృహంలోనే ఉన్నామనే భద్రతా భావనను కలిగించే లక్ష్యంతో ఫ్రెషర్స్ పార్టీని నిర్వహించారు. ఈ యేడాది వేడుకలలో ఆకర్షణీయమైన ర్యాంప్ వాక్, సాంప్రదాయ – సమకాలీన నృత్య ప్రదర్శనలు, స్థానిక జానపద ట్యూన్ లు, బాలీవుడ్ హిట్లతో కూడిన శ్రావ్యమైన పాటలు, వినోదాత్మక స్కిట్లు విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపాయి. అందరగా అలంకరించిన ప్రాంగణంలో పసందైన నిందు ఈ వేడుకలను మరపురాని రోజుగా మార్చాయి.ఎంతో వుందిని ఆకట్టుకున్న ర్యాంప్ వాక్ లో విద్యార్థులు తము చరిష్మా, శైలిని ప్రదర్శించారు. ఇక మిస్టర్. అండ్ మిస్ ఫ్రెషర్స్ ప్రకటన కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూసి, విజేతలను ప్రశంసలతో ముంచెత్తారు.తమ విద్యా లక్ష్యాలను నెరవేర్చుకోవడంతో పాటు బాధ్యతాయుతమైన పౌరులుగా, వృత్తి నిపుణులుగా ఎదిగాలని ప్రతి ఒక్కరూ దీక్షబూనాలని మేనేజ్ మెంట్ ప్రతినిధులు ఫ్రెషర్స్ కు సూచించారు. గీతం కుటుంబంలోకి వారికి సాదరంగా స్వాగతించారు.సీనియర్ల నుంచి తమకు లభించిన సాదర స్వాగతానికి ఫ్రెషర్లు కృతఙ్ఞతలు తెలియజేశారు. ఈ వేడుకలను విజయవంతం చేయడానికి వారు చేసిన ప్రయత్నాలను అభినందించారు. ఈ వేడుకల సందర్భంగా ఏర్పడిన స్నేహబంధం గీతమ్ లోని శక్తివంతమైన కమ్యూనిటీకి నిదర్శనంగా నిలవడమే గాక, ప్రతి విద్యార్థికి విలువ ఉంటుందని మరోసారి రుజువు అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *