మన వార్తలు ,పటాన్ చెరు:
గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ‘ ఫ్రెషర్స్ డే ‘ ఉత్సవాన్ని ‘ పార్టీ సెటెమోల్ ‘ పేరిట శుక్రవారం ఘనంగా నిర్వహించారు . స్నేహపూర్వక వాతావరణంలో కొత్త విద్యార్థులను స్వాగతించి , వారి విశ్వాసాన్ని చూరగొనడంతో పాటు వారిలో సృజనాత్మకతను గుర్తించి , ప్రోత్సహించే లక్ష్యంతో ఈ వేడుకలను ఏర్పాటు చేశారు . సీనియర్లు , జూనియర్లు అనే భేదాన్ని మరిచి , తామంతా ఫార్మసీ విద్యార్థులనే అనే భావన పెంపొందించ డంతో పాటు ఐక్యంగా అంతా ఒక్కటె ఈ వేడుకలను నిర్వహించారు . కొత్త విద్యార్థులను స్వాగతించడానికి సీనియర్లు అనేక సాంస్కృతి కార్యక్రమాలను రూపొందించి , ప్రతి ఒక్కరిలో నిబిడీకృతంగా ఉన్న ప్రతిభను వెలికితీసే ప్రయత్నం చేశారు .
ఆయా పాటలకు తగ్గట్టు విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ అలరించడంతో పాటు ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి . మెరిసిపోతున్న దుస్తులలో విద్యార్థులు చేసిన ర్యాంప్ వాక్ ఉత్సవానికే మకుటంగా నిలిచింది . తొలుత , గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , సెన్ట్స్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు జ్యోతి ప్రజ్వలన , ప్రేరణోపన్యాసాలతో ఈ ఫ్రెషర్స్ డే వేడుకలను ప్రారంభించారు . ఫార్మసీ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్ తన స్వాగతోపన్యాసంలో విద్యార్థుల కృషిని అభినందించారు . పసందెన విందుతో ఈ ఒక్కరోజు వేడుకలు విజయవంతంగా ముగిశాయి .
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…