త్వరలో మంచినీటి పైప్ లైన్ పనులు ప్రారంభం ఎమ్మెల్యే జిఎంఆర్

Hyderabad Telangana

త్వరలో మంచినీటి పైప్ లైన్ పనులు ప్రారంభం
ఎమ్మెల్యే జిఎంఆర్

 

పటాన్చెరు

నాలుగున్నర కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పటాన్చెరు పట్టణంలో చేపట్టనున్న నూతన మంచి నీటి పైపులైన్ నిర్మాణ పనులు అతి త్వరలో ప్రారంభం కానున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, హెచ్ ఎం డబ్ల్యు ఎస్ సి జి ఎం దశరథ రెడ్డి, జనరల్ మేనేజర్ బలరాం రాజులతో కలిసి పట్టణంలో పర్యటించారు. పైప్ లైన్ నిర్మాణ సమయంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

పట్టణంలో 40 సంవత్సరాల క్రితం ఏర్పాటుచేసిన పైప్ లైన్ కి తరచు లీకేజీలు ఏర్పడటం మూలంగా సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. ఈ అంశంపై జలమండలి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా, నాలుగున్నర కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం పటాన్చెరు పట్టణ పోలీస్ స్టేషన్ నుండి టోల్ గేట్ వద్ద గల జలమండలి కార్యాలయం వరకు నూతన పైప్ లైన్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. రెండో దశలో నక్క వాగు నుండి పోలీస్ స్టేషన్ వరకు పైపులైన్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *