_సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం–రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్
మన వార్తలు, శేరిలింగంపల్లి :
అతిగా కురుస్తున్న వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆర్ కే వై టీం సభ్యులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ గారి సమక్షంలో ఈరోజు మదినగూడ లో ఉచితంగా గొడుగుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా టీం సభ్యులు మాట్లాడుతూ మా నాయకులు రవికుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు నిరుపేదలైన వారికి ఉచితంగా గొడుగులు పంపిణీ కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమం నియోజకవర్గంలో ఫుట్ పాత్ మీద, గుడిసెలో నివసిస్తున్న వారికి ఆర్ కే వై టీం తరఫున మౌలిక అవసరాలు తీర్చడంలో మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ ఏడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల బారి నుండి కాపాడుకోవడానికి గొడుగుల పంపిణీ కార్యక్రమం చేపట్టిన టీం సభ్యులను అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్ కే వై టీం సభ్యులు గుండె గణేష్ ముదిరాజ్, జాజెరావు శ్రీనివాస్, జాజేరావు రాము, ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, నరేష్ నాయకులు బోయినపల్లి వినోద్ రావు, ఎల్లేష్, యాదగిరి ముదిరాజ్, అశోక్ గౌడ్, రాజేష్ గౌడ్, రమేష్, సత్యనారాయణ మొదలగు వారు పాల్గొన్నారు