_ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా గణేష్ గడ్డ సిద్ది వినాయక దేవాలయం
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
రుద్రారం శ్రీ సిద్ది గణపతి దేవాలయాన్ని రాష్ట్రంలోనే ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.దేవాలయ అభివృద్ధిలో భాగంగా ఒక కోటి 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన అన్నదాన సత్రం, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శనివారం ఉదయం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎంతో ప్రాశస్త్యం పొందిన సిద్ధి గణపతి దేవాలయాన్ని అంచలంచలుగా అభివృద్ధి పరుస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 50 లక్షల రూపాయల సొంత నిధులను అయ్యప్ప, శివ, ఆంజనేయ స్వామి భక్తుల కోసం ధ్యాన మందిర నిర్మాణ పనులకు కేటాయించామని తెలిపారు. రాజ గోపురాల నిర్మాణాలకు కోటి యాబై లక్షల రూపాయల సొంత నిధులను అందించామని పేర్కొన్నారు.రోజురోజుకీ ఆలయాన్ని దర్శించే వారి భక్తుల సంఖ్య పెరుగుతోందని, ఇందుకు అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి పరుస్తున్నట్లు తెలిపారు.నియోజకవర్గంలోని పురాతన ఆలయాలను జీర్ణోధారణ చేయడంతో పాటు, నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎంపీటీసీలు రాజు, హరి ప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీపీలు శ్రీశైలం యాదవ్, గాయత్రి పాండు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు పాండు, సిఐ లాలు నాయక్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నరసింహారెడ్డి, ఈవో మోహన్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గీతం కార్యశాల ప్రారంభోత్సవంలో ఐఐటీ భువనేశ్వర్ ప్రొఫెసర్ ఆశాభావం పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశం ప్రపంచ సెమీకండక్టర్…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న మాజీ ప్రొఫెసర్ సి.రాఘవేంద్రరావు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాబోయే మూడు దశాబ్దాలు…
శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : పోలీసుల సేవలు మరువలేనివనీ కృష్ణ మూర్తి ఫౌండేషన్ చైర్మన్ కంజర్లకృష్ణ మూర్తి చారి అన్నారు.…
శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణలో ఉప ఎన్నికలు జరుగుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది.హైదరాబాద్ జిల్లా…
19 మంది లబ్ధిదారులకు 7 లక్షల 22 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ పటాన్ చెరు ,మనవార్తలు…
అతి త్వరలో శాశ్వత ప్రాతిపాదికన పాలిటెక్నిక్ కళాశాల భవనం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు…