పటాన్చెరు,,మనవార్తలు ప్రతినిధి :
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి పల్లె ప్రగతికి నిదర్శనంగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలో 9 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణ పనులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తూ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు వివిధ పరిశ్రమల సహకారంతో సిఎస్ఆర్ నిధులను కేటాయిస్తూ గ్రామాలను అభివృద్ధికి ప్రతీకలుగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మధు, ఎంపీటీసీ లు మంజుల శ్రీశైలం, మాధవి నరేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ విష్ణు వర్ధన్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.