పటాన్ చెరు
ఆపదలో ఉన్నవారికి ఆదుకొంటు అడిగిన వారికి లేదు అనకుండా సహాయం చేస్తూ సేవే లక్ష్యంగా ముందుగు సాగుతున్న పటాన్ చెరు మాజీ సర్పంచ్ ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు మరో సారి తన మంచి మనసు చాటుకున్నారు.దేవాలయాల అభివృద్ధికి ఎల్లప్పుడూ ముందుండే దేవేందర్ రాజు మరోసారి తన దైవభక్తిని చాటుకున్నారు .సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలంలోని పటేల్ గూడా గ్రామ పంచాయతీలో గల బి హెచ్ ఈ ఎల్ కార్మికుల కాలనీ కు సంబంధించిన మెట్రో ఎన్ క్లేవ్ మరియు ఇతర కాలనీల దారిలో
శ్రీ శ్రీ శ్రీ పంచముఖి హనుమాన్ దేవాలయం నిర్మాణానికి పటాన్ చెరు మాజీ సర్పంచ్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు గారు లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవ భక్తుని అలవాటు చేసుకోవాలి సూచించారు.
తద్వారా మనశ్శాంతిని పొందుతారని, రోజువారి నిర్వహించే పనుల్లో విజయవంతంగా ముందుకు పోయే అవకాశం ఉంటుందన్నారు. దేవుడి ఆశీస్సులతో మానసిక ప్రశాంతతతో ప్రతి ఒక్కరూ సుఖవంతమైన జీవితాన్ని గడపాలని ఆయన ఆకాంక్షించారు. హనుమాన్ ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ ఎంపీపీ ఈర్ల దేవానంద్, పటేల్ గూడా సర్పంచ్ శ్రీకాంత్, ఉప సర్పంచ్ జ్ఞానేశ్వర్, ఐఎన్టీయూసీ జిల్లా నాయకులు దామోదర్ రెడ్డి, మెట్రో ఎన్ క్లేవ్, సూర్యోదయ కాలనీ వాసులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…