ఎమ్మెల్యే భూకబ్జాలకు అధారాలతో సహాచూపిస్తా_మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్

Districts politics Telangana

– మహిపాల్, మధుసూదన్ అక్రమాలు కోకొల్లలు

– మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ఫైర్

మన వార్తలు, పటాన్ చెరు:

అభద్రతాభావంతో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని, ఎమ్మెల్యే భూ కబ్జాలను నిరూపించి ఎంతటి పోరాటానికైనా సిద్దమేనని బీజేపీ రాష్ట్ర నేత , పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ సవాల్ విసిరారు. పటాన్ చెరు‌ మండలం బచ్చుగూడ లో బీజేపీ రాష్ట్ర నేత, పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే టి నందీశ్వర్ గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేసిన వాఖ్యలపై స్పందిస్తూ మాట్లాడారు. ప్రజల సానుభూతిని పొందేందుకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేసిన అవినీతిపై ప్రధాన మంత్రికి దొడ్డిదారిన వెళ్లి వినతి పత్రాన్ని సమర్పించటం సాధ్యమేనానని ప్రశ్నించారు.తాను యంపిపి గా, ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులపై శ్వేత పత్రం ఇవ్వడానికి సిద్దమన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఎంపీపీగా ఉన్నప్పుడు ఓ మహిళా అధికారిపై అసభ్యకరంగా ప్రవర్తించిన తీరు ప్రజలకు తెలుసన్నారు.

ఎమ్మెల్యే, అతని సోదరుడు మధు సూధన్ చేసిన కబ్జాలను ఆధారాలతో సహా తన వద్ద ఉన్నాయని చెప్పారు. లక్డారంలో క్రషర్ అనుమతులు 10ఎకరాలకు ఉంటే అక్కడ శిఖంలో 45 ఎకరాలు కబ్జా పెట్టిన ఘనత ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దేనని అన్నారు. క్రషర్లు ద్వారా నెలకు 4లక్షల టన్నుల మైనింగ్ కుంభకోణం చేస్తున్నాడని, అక్రమ మైనింగ్ ద్వారా నెలకు 12కోట్లు సంపాదిస్తూ ఏడాదికి కోటి రూపాయలు కట్టాల్సిన పన్నులు రూ. 4 లక్షలు మాత్రమే చెల్లిస్తున్నాడని తెలిపారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అక్రమాలను తాను రుజువు చేయకపోతే కొట్టి చంపండని, జైలు లో పెట్టండని మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ఘాటుగా స్పందించారు.

బీజేపి నేత శ్రీనివాస్ గుప్త కు చెందిన భూమి సర్వే నెంబర్ 976లో చనిపోయిన వ్యక్తి పేరుతో ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి ఫేక్ ఆధార్ కార్డు, డాక్యుమెంట్లు సృష్టించి సుమారు 74 ప్లాట్లను కబ్జా చేసినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. పెద్దకంజర్ల లో 2007 నుంచి 2014 వరకు పోరంబోకుగా ఉన్న ఐదెకరాల భూమి మధు సూధన్ రెడ్డి చొరవతో పట్టా భూమిగా ఎలా మారిందని ప్రశ్నించారు. 172/ఈ సర్వే నెంబర్ లో 14 ఎకరాల భూమిని ఓ వ్యక్తిని బెదిరించి హస్తగతం చేసుకున్నాడన్నారు. భూ కుంభకోణాలు, అవినీతి సొమ్మును 40శాతం ఎమ్మెల్యే, 40 శాతం బిల్డర్లు 20శాతం అధికారులు వాటాలు పంచుకుంటున్నారన్నారు‌. జీయంఆర్ కన్వెన్షన్ హల్ కబ్జానే అని, రోడ్లు మూసేసి మ్యారెజ్ హాల్ నిర్మాణం చేశారని తెలిపారు.

ఇంటి పక్కనే రామమందిరం ఆలయాన్ని కబ్జా చేశారని, ఖాళీ జాగాలు కనిపిస్తే లారీలను పార్కింగ్ చేసి కబ్జాలకు పాల్పడే చరిత్ర మీదని‌ నందీశ్వర్ గౌడ్ దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో కాపాలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్ దోచుకునే కుక్కలా మారాడని, దోచుకున్న డబ్బు మళ్లీ ఎన్నికలలో ఖర్చు చేసేందుకు 50 కోట్లు ఇస్తామనటం ఎంతవరకు సమంజసమన్నారు. తనకు బిజెపి నుంచి టికెట్ వస్తదా అని హేళన చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, బిజేపి పార్టీ అని, .గతంలో టికెట్ రాకుండా కొందరికి డబ్బులిచ్చి ప్రలోభపెట్టిన చరిత్ర నీది అని అన్నారు. ఎన్నో పాపాలు, కబ్జాలు ఆరోపణలు ఎదుర్కొంటున్న నీకు టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వదనే భయంతో కార్యకర్తను నిలబెడతానని అంటున్నావని చెప్పారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, తమ్ముడు మధుసూదన్ రెడ్డి భూకబ్జాలపై బీజేపీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ధర్మ పోరాటానికి, ఎంతటి ఉద్యమాలకైనా వెనకడుగు వేసేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో బిజేపి జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *