పంజాబ్‌ పోలీసులు భద్రతను గాలికొదిలేశారని _రాష్ట్ర బిజెపి మహిళ మాజీ ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి

Districts politics Telangana

మనవార్తలు , రామచంద్రపురం

బిజెపి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ మీద పంజాబ్ రాష్ట్రంలో జరిగిన సంఘటన దృష్ట్యా మోడీ ఆయురారోగ్యాలతో ఉండాలని రాష్ట్ర బిజెపి మహిళ మాజీ ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో రామచంద్రపురం లో సాయినగర్, సాయిబాబా దేవాలయంలో మృత్యుంజయ హోమం కార్యక్రమం నిర్వహించారు అనంతరం గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ పంజాబ్లో జరిగిన ఘటన దురదృష్టకరం, మోడీ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని కేరుకుంటూ మృత్యుంజయ హోమం జరిపించామన్నారు .

ప్రధానికి పంజాబ్ పర్యటనలో భద్రతా కల్పించడంలో పంజాబ్ ప్రభుత్వం విఫలమైందని దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి మోడీ తీసుకున్న నిర్ణయాలు హర్షణీయం, ఆయన చేస్తున్న సేవలు ,కార్యక్రమాలు ,తీసుకొచ్చిన పథకాలు దేశం కోసం ఆయనే పడే తపన ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని ,దేశం కోసం, ధర్మం కోసం, పనిచేస్తున్న నరేంద్రమోడి ని ఎదుర్కొలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని గోదావరి అంజిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీ, అమీన్పూర్ కౌన్సిలర్ ఎడ్ల రమేశ్, పద్మావతి, జిల్లా కార్యదర్శులు సరస్వతి, బైండ్ల కుమార్, సుజాత,స్వాతి, నర్సింగ్ గౌడ్, అదెల్లి రవీందర్, అసెంబ్లీ కన్వీనర్, శ్రీనివాస్ గుప్తా, అమీన్పూర్ అధ్యక్షులు అగారెడ్డి, జిల్లా నాయకులు, మండల నాయకులు పెంటెశ్, కృష్ణ రెడ్డి,గోవర్ధన్, బలరామ్, పద్మావతి,పూర్ణిమ, సంజీవ, విజయ్ కుమార్ గౌడ్, రవీందర్ గౌడ్ కృష్ణ వేణీ బృధం, పెంటారెడ్డి, రాంబాబు,రమేశ్ గుప్తా మరియు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *