సాంకేతిక నైపుణ్యాల మెరుగుదల కోసం

Telangana

-బీఈఎక్స్ఎల్ తో గీతం అవగాహన

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడానికి గాను బీఈఎక్స్ఎల్ ఇండియా కన్సల్టింగ్ తో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం అవగాహన ఒప్పందం చేసుకుని, తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అధికారికంగా ప్రకటించాయి. గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్. రావు, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరక్టర్. ప్రొఫెసర్ సి.ఆర్.శాస్త్రిల సమక్షంలో ఈ అవగాహన కుదిరింది. గీతం బీఈఎక్స్ ఎల్ ల మధ్య సహకారం భారతీయ నిర్మాణ పరిశ్రమలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడాన్ని ప్రోత్సహించడంపై దృష్టి సారించడమే గాక, సామర్థ్యాన్ని పెంచడం, జాప్యం లేదా వ్యాయాలను తగ్గించడంపై దృష్టి సారించింది. బీఈఎక్స్ఎల్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్ ల సూట్ ను ఉపయోగించి ఓపెన్ బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ (బీఐఎం), ఇంటిగ్రేటెడ్ బీఐఎం వినియోగాన్ని ప్రోత్సహించడం, గీతం విద్యార్థులకు అవసరమైన డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ శిక్షణ అందించడం, అధునాతన బీఐఎం మేనేజ్మెంట్ టెక్నిక్ లో పరిశోధనను ప్రోత్సహించడం ఈ ఎంవోయూ లక్ష్యం.

ఇందులో భాగంగా, స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘బీఈఎక్స్ ఎల్ మేనేజర్ ను ఉపయోగించి నిర్మాణ నిర్వహణ కోసం ఇంటిగ్రేటెడ్ 5డీ బీబిఎం’ పేరిట, ఆ సంస్థ సీనియర్ కన్సల్టెంట్ మన్సూర్ అహ్మద్ ఆతిథ్య ఉపన్యాసం చేశారు. నిర్మాణ పరిశ్రమలో బీఐఎం ప్రాముఖ్యత, పరిశ్రమ భవిష్యత్తు కోసం. దాని వినియోగం వంటి అంశాలను ఆయన వివరించారు. బీఐఎంను వినియోగించే విధానం, తద్వారా ఒనగూరే ప్రయోజనాలను అదే సంస్థ కన్సల్టెంట్ జి.సుప్రియ విద్యార్థులకు ప్రయోగాత్మకంగా చేసి చూపారు.సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ సీహెచ్, అఖిలేష్ అతిథులను స్వాగతించి, జ్ఞాపికలతో సత్కరించగా, అసిస్టెంట్ ప్రొఫెసర్ సునీల్ నందిపాటి వందన సమర్పణ చేశారు.ఈ అవగాహన పరిశ్రమ-విద్యా సంస్థ మధ్య సహకారాన్ని పెంపొందించడమే గాక, నిర్మాణ రంగ అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక నైపుణ్యాలు, జ్ఞానంతో విద్యార్థులను ప్రోత్సహించే వీలు కల్పిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *