రామచంద్రాపురం,మనవార్తలు ప్రతినిధి :
ప్రేమకు శాంతికి ఆధ్యాత్మిక చింతనకు ఏసు క్రీస్తు గొప్ప ప్రతిక అని ఏకె ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ అన్నారు . సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం రామచంద్రాపురంలో ఏకె ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు . క్రిస్మస్ పండుగ సందర్భంగా రామచంద్రాపురంలో పరిధిలోని పాస్టర్లను శాలువాలతో ఘనంగా సత్కరించారు. దేశంలో అనేక మతాలవారు, అనేక ప్రాంతాల వారు, అనేక సంస్కృతి సాంప్రదాయాలను ఆచరిస్తున్న ప్రజలు జీవనాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు.
దేశంలో ఉండే ప్రజలందరూ మతాలు వేరైనా ప్రాంతాలు వేరైనా.. సంస్కృతి సాంప్రదాయాలు వేరైనా కలిసిమెలిసి జీవించి ఉండటం గొప్ప విషయంగా చెప్పారు. పండగ ఏ మతం వారిదైనా భారత దేశంలో ప్రజలందరూ ఐక్యమత్యంతో జరుపుకుంటామన్నారు. అనంతరం క్రిస్మస్ కేక్ కటింగ్ చేసి క్రిస్టియన్స్ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ అబ్దుల్ ఖదీర్, శివకుమార్, కిషోర్, శంకర్, సలీం, జబ్బర్, సయ్యద్ ఇర్ఫాన్, అస్సలామ్ తదితరులు పాల్గొన్నారు.