మన వార్తలు, శేరిలింగంపల్లి :
లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఘట్టమనేని బాబురావు జన్మదిన సందర్బంగా ఆదివారం రోజు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హెల్పింగ్ హాండ్స్ అధ్యక్షుడు మొవ్వా సత్యనారాయణ, కార్యదర్శి సిహెచ్ .నవీన్ గౌడ్, కోశాధికారిఎస్. ప్రశాంత్ ల ఆధ్వర్యంలో 150 మందికి పైగా పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరి, పృథ్వి ,చిట్టా రెడ్డి ప్రసాద్ , పృథ్వి, మరియు హెల్పింగ్ హాండ్స్ టీం పాల్గొన్నారు.