మత్స్యకారుల సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం నీలం మధు ముదిరాజ్

Andhra Pradesh Districts National politics Telangana

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో సంప్రదాయ మత్స్యకారుల మహాసభ

నీలం మధుకు ప్రతి మండల కేంద్రంలో ఘన స్వాగతం పలికిన మత్స్యకారులు

పెద్దకొత్తపల్లి చౌరస్తా నుండి సభా ప్రాంగణం వరకు బైక్ ర్యాలీ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

మత్స్యకారుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని కొల్లాపూర్ నియోజక వర్గం కొల్లాపూర్ పట్టణం ఎస్ ఎమ్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన సాంప్రదాయ మత్స్యకారుల 8వ మహాసభలో స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ పగిడీల శ్రీనివాస్ గారితో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దకొత్తపల్లి చౌరస్తా నుండి సభా ప్రాంగణం వరకు డప్పు చప్పులతో, భారీ ర్యాలీతో నీలం మధు కు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ నీలి విప్లవంతోనే మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండుతాయన్న తలంపుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. గత ప్రభుత్వాలు కేవలం ఓటు బ్యాంకు గానే చూసిన మత్స్యకారులను రేవంత్ ప్రభుత్వం గుర్తించి గౌరవిస్తుందన్నారు. ఆ దిశగానే చెరువుల సంరక్షణకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి హైడ్రాను ఏర్పాటు చేసి చెరువుల పరిరక్షణకు కృషి చేస్తున్నారని కొనియాడారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగనణతో ముదిరాజులకు రాజకీయంగా అవకాశాలు పెరగడంతో చట్టసభల్లో మన వానిని వినిపించే అవకాశం లభించనుందన్నారు. ఇప్పటికే ముదిరాజులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని త్వరలో మన సమస్యలకు పూర్తి పరిష్కారం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మన జాతిని గౌరవించి జాతి అభ్యున్నతి కోసం సహకరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ముదిరాజ్ సోదరులంతా స్థానిక ఎన్నికల్లో సహకరించి కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు వాకిటి ఆంజనేయులు, రజని,మల్లికార్జున్, కొల్లాపూర్ మత్స్యశాఖ వైస్ చైర్మన్ సొప్పరి మల్లయ్య,సోపరి వెంకటస్వామి ,నాగరాజు,మాజీ వైస్ ఎంపీపీ వెంకటస్వామి,మల్లయ్య, మత్స్యశాఖ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *