శేరిలింగంపల్లి :
విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ హక్కుల సాధన కొరకు ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద చేపట్టిన రెండురోజుల రిలే నిరాహార దీక్ష కార్యక్రమo మొదటి రోజైన సోమవారం రోజు దీక్ష విజయవంతం అయిందని సంఘం సభ్యులు తెలిపారు. వడ్ల సుదర్శన చారి ఆధ్వర్యంలో మొదటిరోజు భారీ ఎత్తున విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని రిలే నిరాహార దీక్షను జయప్రదం చేసిన విశ్వకర్మ సోదరులందరికీ, ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇందులో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు జి ప్రసాద్ కుమార్, మరియు దాసోజు శ్రవణ్ కుమార్, యు.జి.సి అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ లు హాజరయ్యారు. మొదటి రోజు దీక్షలో కూర్చున్న సభ్యులు వడ్ల సుదర్శన చారి, కంజర్ల కృష్ణమూర్తి, బచ్చల పద్మ చారి, పొన్నాల, మోత్కూరీ వీరభద్రా చారి, వడ్ల మహేందర్, వడ్ల చిరంజీవులు మల్లెల అనంత చారి, లత, సంగారెడ్డి సరిత, భరత్ చారి, దినేష్ చారి, రాంబ్రహ్మం చారి, రవీంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.