Hyderabad

తెలంగాణలో కొత్తగా 14 ఫిపోలా ఔట్ లెట్లను ప్రారంభించిన ఫిపోలా రిటైల్ ఇండియా

హైదరాబాద్

మాంసం విక్రయ సంస్థ …ఫిపోలా తెలంగాణలో తమ సేవలను విస్తరించింది. తెలంగాణలో కొత్తగా 14 ఫిపోలా ఔట్ లెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ఫౌండర్ సుశీల్ తెలిపారు .వచ్చే ఏడాదిలోగా దక్షిణ భారత దేశంలో 64 ఔట్ లెట్లు ఏర్పాటు చేస్తామని… ..2022 లోగా దేశ వ్యాప్తంగా రెండు వందల స్టోర్లు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు . మాంసం సీఫుడ్ తో పాటు ఐదు వందల రకాల మాంసపు ఉత్పత్తులను అందుబాటులో ఉంచామన్నారు. నాణ్యమైన ,తాజా మాంసంను నేరుగా వినియోగదారుడికి అందిస్తున్నట్లు సీఓఓ అంజోయ్ కుమార్ దాస్ తెలిపారు .

హైదరాబాద్ లో ఫిపోలా ఔట్ లెట్లు బంజారాహిల్స్, మాదాపూర్ ,చందానగర్ ,హిమాయత్ నగర్ ,కూకట్ పల్లి,కొండాపూర్ , ప్రగతి నగర్ ,బేగంపేట్, మణికొండ, దిల్ సుఖ్ నగర్ , అత్తాపూర్ ,కొత్తపేట్, గచ్చిబౌలి, శంషాబాద్ లో ఏర్పాటు చేశామన్నారు. ఐదేళ్ళ ప్రస్థానంలో చెన్నై,కోయంబత్తూర్ ,హైదరాబాద్ లలో 36 ఔట్ లెట్లను ఏర్పాటు చేశామని సుశీల్ తెలిపారు .ఫిష్, ఫౌల్డ్రీ, మేక,గొర్రె నాణ్యమైన మాంసంను వినియోగదారులకు అందిస్తామని హామి ఇచ్చారు.

ఫిపోలా యాప్ డౌన్ లోడ్ చేసుకుని యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు ఆపర్లు,లాయల్టీ పాయింట్లు అందిస్తామని సుశీల్ తెలిపారు .సిగ్వీ,డోన్జో వంటి యాప్ ల ద్వారా తమ ఉత్పత్తులను ఇంటికి డోర్ డెలివరీ చేస్తామని తెలిపారు .దీంతో పాటు తాము సొంతగా డోర్ డెలివరీ చేస్తామన్నారు .

తమిళనాడు రాష్ట్రంలో 8 ఫిపోలా గ్రిల్ హౌస్ లను ఏర్పాటు చేశామని… త్వరలో హైదరాబాద్ లో కూడా గ్రిల్ హౌస్ లను ఏర్పాటు చేస్తామన్నారు .

తమ స్టోర్ లో తాజా మాంసంతో పాటు చికెన్ ,ఫిష్ , మటన్ ,విదేశాలకు చెందిన సీ ఫుడ్ , ఇతర మసాలా పౌడర్లు, మాంసపు ఉత్పత్తులు పిఫోలా స్టోర్లలో అందుబాటులో ఉంచామన్నారు . తమ వద్ద ఆర్డర్ చేసిన కస్టమర్లకు 120 నిమిషాల్లో డోర్ డెలివరీ చేసే వెసలు బాటు కల్పించామన్నారు . ప్రస్తుతం తమ సంస్థలో 330 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని …త్వరలో 710 మందికి ఉపాధి కల్పిస్తామన్నారు .

Ramesh

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

11 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

12 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago