మనవార్తలు ,శేరిలింగంపల్లి :
పేదలకు సేవ చేయడం లోనే సంతృప్తి ఉందని నమ్మే ఆర్ కె వై టీమ్ సభ్యులు అందుకు తగ్గట్టు సేవా కార్యక్రమాలు నిర్వయిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అందులో భాగంగానే గురువారం రోజు ఆర్ కె వై టీమ్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి వాళ్ళ చెల్లి మ్యారేజ్ కి ఆర్ కే వై టీం ఐదువేల రూపాయల విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ కె వై టీమ్ సభ్యులు గుండె గణేష్ ముదిరాజ్, జాజేరావు శ్రీను, జాజే రావు రాము, వినోద్ ,జాన్ రెడ్డి ఇతరులు పాల్గొన్నారు.