_హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉమ్మడి మెదక్ జిల్లా అద్యక్షుడు మెట్టుశ్రీధర్
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : గత 19 వ తేదీన డ్యూటీ నిమిత్తం బయలుదేరి ప్రమాదానికి గురై బ్రేయిన్ డెడ్ అయ్యి మరణించిన ఇస్నాపూర్ ఇందిరమ్మ కాలనీకి చెందిన కుమ్మరి అనిత కుటుంబాన్ని ఉమ్మడి మెదక్ జిల్లా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు మెట్టుశ్రీధర్ పరామర్శించి పదివేల రుపాయల ఆర్థిక సహాయాన్ని అందిచారు. తాను చనిపోతు మరో 8 మందికి అవయవ దానం చేసి వారికి పునర్జన్మను ప్రసాదించిందని వారు నిరుపేదలైనప్పటికి గొప్పమనస్సు చాటుకున్నారని దాతలు ముందుకొచ్చి వారిని ఆదుకోవాలని మెట్టుశ్రీధర్ కోరారు.అవయవదానాల విషయంలో ప్రజలకు మరింత అవగాహన కల్పిస్తే ఆపదలో ఉన్నవారిని కాపాడుకోవచ్చని తెలిపారు మరియు డ్యూటి నిమిత్తం బయలుదేరి మరణించడం వల్ల కంపెనీ తరపున పరిహారం అందించేవిధంగా కృషిచేయాలని జిల్లా లేబర్ కమీషనర్ దృష్ఠికి తీసుకెళ్ళి వినతిపత్రం అందించినట్టు మెట్టుశ్రీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డప్పు అరవింద్, కాంటా రాములు, శ్రీకాంత్ ,అనిల్ శ్రీనివాస్,చరణ్, తదితరులు పాల్గొన్నారు.