పీఎమ్ జె జ్యువలరీ షోరూం ను ప్రారంభించిన సినీ నటుడు మహేష్ బాబు కుమార్తె సితార

Hyderabad Lifestyle Telangana

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :

తనకు నగలంటే చాల ఇష్టమని మహేష్ బాబు కూతురు సితార అన్నారు. పీఎమ్ జె జువలర్స్ 40వ స్టోర్‌ను పంజాగుట్టలో సితారా ప్రారంభించారు .60 సంవత్సరాల క్రితం, 1964లో ప్రారంభం అయిన ఈ ప్రయాణం నేటికి ప్రజల మన్ననాలతో విజయవంతగా దూసుకెళ్తుంది. గత 6 దశాబ్దాలుగా మీ అత్యంత విశ్వసనీయ ఆభరణ వ్యాపారిగా, మీరు గర్వంగా ధరించే ప్రతి పీఎమ్ జె ఆభరణంలో ప్రామాణికతను కాపాడుతూ మా వాగ్దానాన్ని నిలబెట్టాము.ఆభరణాలు కేవలం అలంకార వస్తువులు మాత్రమే కాదు. అంత కంటే ఎక్కువ. పీఎమ్ జె ఆభరణాలను సితారా ప్రారంభించడం సంతోషంగా ఉందని యాజమాన్యం తెలిపింది.

1964 నుంచి మేము అత్యంత ఆదరణీయ స్వర్ణకారులుగా ఉంటూ వినియోగదారుల సంతోషంలో భాగస్వామ్యం అవడం సంతోషంగా ఉంది అని అన్నారు. హాఫ్ సారీ ఫంక్షన్‌ల నుండి వార్షికోత్సవ ఉత్సవాల వరకు అన్నింటికీ సరిపడే విస్తృత శ్రేణి ఆభరణాలను ఈ షాప్ లో అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు.సరికొత్త డిజైన్‌లతో మీ అభిరుచికి తగ్గట్టుగా ఇక్కడ అన్ని ఆభరణాలు అందుబాటులో ఉన్నాయి. 40 స్టోర్‌లలోనూ సొంత డిజైన్ లు, తయారీ యూనిట్ కలిగిన ఏకైక ప్రాంఛైస్ పీఎమ్ జె సంస్థ అని తెలిపారు . సహజ వజ్రాలతో పొందుబారిచిన ఆభరణాలు ప్రత్యేకం అని యాజమాన్యం చెప్పారు. మా కస్టమర్‌లను కుటుంబంగా భావిస్తాము అని వారి మనసుకు నచ్చే డిజైన్ లో ఆభరణాలను అందుబాటులో ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *