పోరాటయోధుడు పండగ సాయన్న _నీలం మధు ముదిరాజ్

politics Telangana

_భూస్వాములకు రజాకర్లకు వ్యతిరేకంగా చేసిన పోరాటం మర్చిపోలేనిది 

_ఆయన స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

నిజాం రజాకర్లకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి పేద ప్రజల కడుపు నింపిన పోరాటయోధుడు పండగ సాయన్న అని నీలం మధు ముదిరాజ్ అన్నారు.మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో పండగ సాయన్న చౌరస్తాలో ఏర్పాటు చేసిన పండుగ సాయన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ , ఎమ్మెల్యేలు ఎన్ ఎం శ్రీనివాస్ రెడ్డి, శ్రీహరి ముదిరాజులతో కలిసి పాల్గొన్నారు.పేద ప్రజలు ఆకలితో అలమటించకూడదని భూస్వాముల నుంచి ఆహార ధాన్యాలు దోచి పేద ప్రజల కడుపు నింపిన మహనీయుడని కొనియాడారు. ఆకలితో అల్లాడుతున్న గ్రామాలలో పండగ సాయన్న అడుగు పెడితే వారి కడుపు నింపి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చిన ఘనత వల్లే సాయన్న కు పండగ సాయన్న పేరు వచ్చిందన్నారు.ముదిరాజ్ కులంలో పుట్టిన ఈ మహానీయుడు బంధుక్ ఎత్తి రజాకర్ల అన్యాయాలను ఎదిరించి ఎదురొడ్డి నిలిచి బహుజనాలకు అండగా నిలిచాడని గుర్తు చేశారు.దక్షిణ భారత దేశంలో రెండు కోట్ల పైచిలుకు జనాభా కలిగిన ముదిరాజ్ కులంలో అయినా జన్మించడం మా అందరి కి గర్వకారణం అని అలాంటి మహావీరుడు స్ఫూర్తితో భవిష్యత్తు తరాలు పోరాటాన్ని అలవర్చుకోవాలని నీలం మధు ముదిరాజ్ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *