శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి :
ముదిరాజ్ ల హక్కుల సాధనకై పోరాడాలని ముదిరాజ్ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన అఖిలపక్ష సమావేశoలో ముదిరాజ్ లకు రాజకీయంగా, విద్య, ఉద్యోగ పరంగా జరుగుతున్న అన్యాయాలపై ముదిరాజు చైతన్య వేదిక ద్వారా శివముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన అఖిల పక్ష సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ బీసి దల్ అధ్యక్షులు దుండ్ర కుమార స్వామి , రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షుడు భానుప్రకాష్ ముదిరాజ్ ,తెలంగాణ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పిట్ల నగేష్ ముదిరాజ్, బాల్కొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వినమర్తి అనిల్, కోరవికృష్ణస్వామి సేవాసమితి ప్రెసిడెంట్ నగేష్,తదితరులు హాజరయ్యారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముదిరాజులను బి.సి డి నుంచి బిసి ఏ లోకి మార్చాలని, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు ముదిరాజులకు కేటాయించాలని కోరారు. చేపల పంపిణి చేయాలని,చేపల కార్పొరేషన్ వ్యవస్థల్లో ముదిరాజులకు అవకాశం కల్పించి, పదివేల కోట్లతో కార్పొరేషన్లను విడుదల చేయాలని, మహిళాలకు కూడా రాజకీయాల్లో స్థానం కల్పిస్తూ మహిళాసాధికారతకై కృషి చేయాలని, ముదిరాజులకు రిజర్వేషన్ శాతం పెంచాలని,ట్యాంకుబండ్ పైన ముదిరాజుల మహనీయుల విగ్రహాలను ప్రతిష్టింప చేయాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి వివిధ ముదిరాజ్ సంఘాల అధ్యక్షులు, ప్రధాన నాయకులు,మేధావులు,యువత,మహిళలు పెద్ద ఎత్తున్న పాల్గొని ముదిరాజుల భవిష్యత్ ప్రణాళికలను, కార్యాచరణ గురించి చర్చలు జరిగాయని అఖిల పక్ష సమావేశ నిర్వాహకులు శివ ముదిరాజ్ తెలిపారు.