మనవార్తలు , రామచంద్రపురం:
సోమవారం నల్గొండ జిల్లా పర్యటనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి కాన్వాయ్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాష్ట్ర బిజెపి మాజీ మహిళా ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి అన్నారు రామచంద్రపురం పట్టణం లో బిజెపి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతు ఈ దాడులు పూర్తిగా సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రైతుల పరామర్శకు వెళ్లిన బండి సంజయ్ గారు వెళ్తే టీఆర్ఎస్ పార్టీ ఎందుకు భయపెడుతోందని ప్రశ్నించారు.
హుజురాబాద్ ఎన్నికల్లో ప్రజలు ఓటుతో సమాధానం చెప్పినా కేసీఆర్ కు బుద్ధి రాలేదని శ్రీమతి గోదావరి అంజిరెడ్డి మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు చేయకుండా అన్నదాతలను ఉద్దేశ్యపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని ఆమె అన్నారు. టీఆర్ఎస్ మోసాన్ని రైతులు గ్రహించారని అదేవిధంగా రాష్ట్రంలో గత మూడు రోజులుగా వర్షాలు పడుతున్న కూడా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఎలాటి చర్యలు తీసుకోకపోవటం చాలా సిగ్గుచే టు అని అన్నారు. దీనికి టీఆర్ఎస్ ప్రభుత్వమే భాద్యత వహించాలని గోదావరి అంజిరెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు లక్ష్మణ్, రాములు, మల్లేష్ ,లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు