_దేశానికి అన్నపూర్ణ తెలంగాణ
_చివరి మడి వరకు నీరందిస్తున్న ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం
_ఆకట్టుకున్న ఎడ్ల బండి, ట్రాక్టర్ల ర్యాలీలు
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయ రంగంలో చేపడుతున్న విప్లవాత్మక సంస్కరణల మూలంగా నేడు తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పటాన్చెరు మండల పరిధిలోని పెద్ద కంజర్ల, నందిగామ, లకడారం గ్రామాల పరిధిలోని రైతు వేదికల వద్ద నిర్వహించిన రైతు దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయా గ్రామాల రైతులు నిర్వహించిన ర్యాలీలు అందర్నీ ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమైక్య పాలకుల వివక్ష, నిర్లక్ష్యం మూలంగా తెలంగాణ వ్యవసాయ రంగం తీవ్ర ఒడిదుడుకులకు లోనైందని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకుని వచ్చారని అన్నారు. ప్రధానంగా రైతుబంధు, రైతు బీమా పథకాలు అన్నదాతకు ఆత్మబంధువుగా నిలిచాయని అన్నారు. పంట పెట్టుబడి సమయంలో వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించకుండా ఎకరాకు పదివేల రూపాయల పెట్టుబడి సహాయం రైతన్నకు పెద్ద ఊరట ఇచ్చిందని అన్నారు. గుంట భూమి ఉన్న రైతు మరణిస్తే పెద్దకర్మ అయ్యే లోపు 5 లక్షల రూపాయల బీమా సొమ్ము అందించడం మూలంగా రైతు కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా అండగా నిలుస్తోందని అన్నారు.
ఆరుగాలం కష్టించి పండించిన పంటకు దేశంలోనే మెరుగైన మద్దతు ధర అందించడంతోపాటు, విరివిగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు, 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు అందించడం మూలంగా రైతన్న ఆర్థిక స్వావలంబన సాధించారని అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను అభివృద్ధి చేయడం మూలంగా ఎండాకాలంలోనూ చెరువుల అలుగులు పొంగుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. రైతులు రెండు పంటలు సమృద్ధిగా పండించుకునే అవకాశాలు ఏర్పడ్డాయని తెలిపారు. ప్రతి ఏటా అంచనాలకు మించి పంటలు ఉత్పత్తి కావడంతోపాటు, దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా అవతరించిందని అన్నారు.రైతన్నకు పెద్ద కొడుకు వలె పరిపాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు యావత్తు రైతాంగం అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాల్లో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, డిఆర్డిఏ పిడి శ్రీనివాస రావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, తాసిల్దార్ పరమేశం, ఎంపీడీవో బన్సీలాల్, సిఐలు వేణుగోపాల్ రెడ్డి, వినాయక్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మండల అధ్యక్షులు పాండు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…