ఆర్కిటెక్చర్ కౌన్సిల్ (సీవోఏ) సౌజన్యంతో నిర్వహణ
అర్హులకు ధ్రువీకరణ పత్రాలు
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (సీవోఏ) సహకారంతో హైదరాబాద్ లోని గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (జీఎస్ఏ), ‘పట్టణ స్థిరత్వానికి మూలస్థంభాలు’పై అధ్యాపక శిక్షణా కార్యక్రమాన్ని (టీటీపీ) మార్చి 17 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనుంది. ఇది నేటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో స్థిరమైన పట్టణ అభివృద్ధి యొక్క కీలకమైన అవసరాన్ని పరిష్కరిస్తుందని విశ్వసిస్తున్నారు.పూణేలోని సీవోఏ-టీఆర్సీ డైరెక్టర్ ప్రొఫెసర్ జయశ్రీ దేశ్ పాండే నేతృత్వంలో, గీతం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బీ.ఎన్. కీర్తి నాయుడు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తారు. పర్యావరణ, సామాజిక, ఆర్థిక స్థిరత్వం అనే మూడు కీలక స్తంభాలపై దృష్టి సారించడం ద్వారా సమకాలీన పట్టణ సవాళ్లను పరిష్కరించడానికి అవసరమైన జ్జానం, సాధనాలతో విద్యావేత్తలు, భాగస్వాములను సన్నద్ధం చేయడం దీని లక్ష్యం.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత విద్యావేత్తలు, పరిశ్రమ నిపుణులు, నిర్వాహకులు, విధాన రూపకర్తలను ఒకచోట చేర్చడం ద్వారా, ఈ కార్యక్రమం భవిష్యత్ తరాలకు స్థితి స్థాపకమైన, స్థిరమైన నగరాలను సృష్టించడానికి అర్థవంతమైన చర్చలు, వినూత్న పరిష్కారాలను పెంపొందించడానికి ప్రయత్నిస్తోంది.సామాజిక, వారసత్వ, ఆర్థిక, పర్యావరణ రంగాలలో స్థిరత్వంపై విద్యా, పరిశ్రమ రంగాల నుంచి ప్రముఖ వక్తలు పాల్గొని శిక్షణ ఇవ్వనున్నారు. పట్టణ స్థిరత్వం కోసం ఉత్తమ పద్ధతులు, వ్యూహాలను అన్వేషించడానికి ఇది ఓ వేదికగా తోడ్పడనుంది. ఈ కార్యక్రమ సారాంశాన్ని పుస్తక రూపంలో ప్రచురించడంతో పాటు శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన వారికి ధ్రువీకరణ పత్రాలను ప్రదానం చేయనున్నారు.ఇందులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు మార్చి 11వ తేదీలోగా గూగుల్ ఫారమ్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీజు, ఇతర వివరాల కోసం కార్యక్రమ సమన్వయకర్తలు 9704 072 387, 9949 807 144లను సంప్రదించాలి, లేదా kbogadi@gitam.edu / gvaddipa@gitam.edu కు ఈ-మెయిల్ చేయాలి.
