మెషిన్ లెర్నింగ్ పై అధ్యాపక వికాస కార్యక్రమం….

Telangana

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 26-28 తేదీలలో ‘మెషిన్ లెర్నింగ్ – ఇట్స్ అప్లికేషన్స్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ’ అనే అంశంపై మూడు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమాన్ని (ఎఫ్ఎపీ) నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు ప్రొఫెసర్ టి.మాధవి, ప్రొఫెసర్ కె.మంజునాథాచారి సోమవారం సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్లను ఇంజనీరింగ్, టెక్నాలజీకి ఎలా అన్వయించవచ్చో అర్థం చేసుకోవడానికి అవసరమైన జ్ఞానం, నెప్తుణ్యాలతో పాల్గొనే వారిని సన్నద్ధం చేయడానికి దీనిని రూపొందించినట్టు వారు తెలిపారు. ఇందులో పాల్గొనేవారు ఆచరణాత్మక అవగాహనతో శిక్షణ పొందడమే గాక పరిశోధన సహకారం కోసం ఇతర గ్రూపుల సహకారం కోరవచ్చని చెప్పారు.

మెషిన్ లెర్నింగ్ ప్రాథమిక లక్ష్యం కంప్యూటర్ సిస్టమ్లను రూపొందించడం, డేటాలోని సంక్లిష్ట నమూనాలు, సంబంధాలను విశ్లేషించి అర్థం చేసుకోవడం, ఖచ్చితమైన అంచనాలను రూపొందించడానికి, చర్యలు తీసుకోవడానికి వీలు కల్పించడమన్నారు. ఈ పద్ధతులను వినియోగించి కొత్త సమస్యలను సులువుగా పరిష్కరించగలిగే ఆచరణాత్మక జ్ఞానాన్ని పొందచ్చని నిర్వాహకులు తెలియజేశారు.ఈ ఎఫ్ఎపీని విద్యావేత్తలు, పరిశోధన స్కాలర్లు, బీటెక్, ఎంటెక్, ఎమ్మెస్సీ చదివే వారికోసం ఉద్దేశించామని, ఆసక్తి ఉన్నవారు తమ పేర్లను ఈ లింక్ https://forms.gle/aimM5hby3LSUfxD8 link ద్వారా ఈనెల 26వ తేదీలోపు నమోదు చేసుకోవచ్చన్నారు. ఇతర వివరాల కోసం కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ | రామకృష్ణ 81060 21619ని సంప్రదించాలని, లేదా rpuvvula@gitam.edu కు ఈ-మెయిల్ చేయాలని వారు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *