5జీ టెక్నాలజీపై గీతమ్ లో అధ్యాపక వికాస కార్యక్రమం

Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ‘5జీ టెక్నాలజీ, ఆసెనై పురోగతి’ అని అంశంపై ఈనెల 8-9 తేదీలలో అధ్యాపక వికాస కార్యక్రమాన్ని (ఎఫ్ ఢీపీ ) నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆ విభాగాధిపతి ప్రొఫెసర్ మాధవి సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. 5జీ టెక్నాలజీలో తాజా పరిణామాలు, అధునాతన కమ్యూనికేషన్ టెక్నాలజీ పరిశోధనకు అవకాశాలను తెలియజేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 5జీ కమ్యూనికేషన్ టెక్నాలజీ రంగంలో తమ పరిశోధనా సామర్థ్యాలను పెంచుకోవడానికి అధ్యాపకులు, పీహెచ్ డీ రీసెర్చ్ స్కాలర్లు, పీజీ విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని తెలిపారు. తమ పరిశోధనా ప్రాంతాలలో 5జీ / 6జీ సాంకేతికతను వర్తింపజేయడానికి, 5జీ / 6 జీకి మించిన రోడ్- మ్యాప్ పై లోతెన అవగాహన పొందేందుకు ఇందులో పాల్గొనే వారికి అవకాశం ఉంటుందని డాక్టర్ మాధవి వివరించారు. ఈ ఉచిత ఎఫ్ ఢీపీలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు తమ పేర్లను ఈనెల 7వ తేదీలోగా నమోదు చేసుకోవాలని, 50 మంది మాత్రమే అవకాశం ఉంటుందని, ముందు వచ్చిన వారి తొలి ప్రాధాన్యం పద్ధతిలో అవకాశం కల్పిస్తామన్నారు. అవసరమైన వారికి నామమాత్రపు ధరకే గీతం హాస్టళ్లలో వసతి కల్పిస్తామని, అయితే ఆ విషయాన్ని నిర్వాహకులకు ముందుగా తెలియజేయాలని ఆమె స్పష్టీకరించారు.మరింత సమాచారం కోసం ఎఫ్ఎపీ సమన్వయకర్త ఎం.రఘుపతి (94415 44079)ని సంప్రదించాలని,లేదా rmangala@gitam.eduకు ఈ-మెయిల్ చేయాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *