– జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ సహాయ ఆచార్యురాలు డాక్టర్ సునీత
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్ చెరు పట్టణంలోని డాక్టర్ అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంటర్ప్రైన్యూర్షిప్ డెవలప్మెంట్ సెల్ వారి ఆధ్వర్యంలో తేనెటీగల సాగు, దాని యొక్క వాణిజ్య ఉపయోగాలు అనే అంశంపై బుధవారం విద్యార్థులకు సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ సహాయ ఆచార్యురాలు డాక్టర్ సునీత ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ… తేనెటీగల జాతి అంతం జరిగితే మానవ మనుగడకు ప్రమాదం అని గుర్తు చేశారు. ప్రిన్సిపల్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. పర్యావరణ అనుకూల వ్యాపారాలు అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. తేనె పెంపకంలో వెలువడే మైనం, ప్రోపోలిస్ యొక్క ఆదాయ వనరుల అవకాశాలను, ఈ కార్యక్రమ నిర్వాహణ కర్త వీరేందర్ విద్యార్థులకు వివరించారు. తక్కువ వ్యవధి, పెట్టుబడితో చేయగల తేనెటీగల పెంపకం ఎంతో ఉపయోగకరమని వైస్ ప్రిన్సిపాల్ అల్లం రెడ్డి అభిప్రాయపడ్డారు. పరపరార్గ సంపర్కం వలన పంటలలో అధిక దిగుబడి పొందవచ్చు అని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులు డాక్టర్ ఉదయ్, డాక్టర్ స్నేహలత, కళాశాల ఆచార్యులు డాక్టర్ రాజిరెడ్డి, రాధిక, కృష్ణ, రవీందర్, హరిత, జానయ్య, స్వప్న, డాక్టర్ భగ్గు, తదితరులు పాల్గొన్నారు.